ఆ బెత్లెహేముపురములో
నడిరేయి మధ్య జాములో
ప్రభు దూత దిగివచ్చే –
దైవ మహిమ ఏమో ప్రకాశించినే
లోకరక్షకుని జనన వార్తను
మంద కాపరులకు తెలియజేసేనే
దావీదూ పట్టణమందు నేడే రక్షకుడు పుట్టాడని
పాపిని శుద్ధిని చేయ దేవాదేవుడే వచ్చాడని
సంతోషమే సంబరమే దేవునితో సమాధానమే…
శుభవార్తను విన్న ఆ గొర్రెల కాపరులు
అబ్బురపడిరే ఆనందించిరే
త్వరత్వర పరుగులతో సాగిపోయిరే
బాలయేసుని కనులగాంచిరే
ఆశ్చర్య ఆనంద పరవసులై – ప్రార్థించి ప్రకటించిరాకాపరులు
లోకానికే దిగివచ్చిన శ్రీ యేసుని జననవార్తను
రక్షకుడే పుట్టాడని ప్రకటించిరి శుభవార్తను
ఆకాశమేఘాన నడిచే నక్షత్రం
జ్ఞానులకే దారి చూపెనే
మిళ మిళమంటూ ముందు నడిచెనే యేసు ఉన్న చోటు తెలిపెనే
బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి సాగిలపడిరి జ్ఞానులు
రాజులకే రారాజని ఘనపరిచిరి నజరేయుని
ప్రభువులకే ప్రభువేయని పూజించిరి శ్రీ యేసుని
Aa Bethlehemu puramulo
Nadireyi madhya jaamulo
Prabhu dootha digivachche –
Daiva mahima emo prakaashinchene
Loka rakshakuni janana vaarthanu
Manda kaaparulaku teliyajesene
Daavidu pattanamandu nede rakshakudu puttadani
Paapini shuddhini cheya DevaDevudey vachchadani
Santhoshame sambarame Devunitho samaadhaaname…
Shubhavaarthanu vinna aa gorrela kaaparulu
Abbura padire aanandinchire
Thvarathvara parugulatho saagipoyire
Baala Yesuni kanulaganchire
Aascharya aananda paravashulai – praarthinchi prakatanchira kaaparulu
Lokanike digivachina Shri Yesuni jananavaarthanu
Rakshakude puttadani prakatanchiri shubhavaarthanu
Aakaasha meghaana nadiche nakshatram
Jnaanulake daari choopene
Mila milamantu mundu nadichene
Yesu unna chotu telipene
Bangaaru saambraani bholamulu arpinchi saagilapadiri jnaanulu
Raajulake Raaraajani ghanaparichiri Nazareyuni
Prabhulakeye Prabhuvenani poojinchiri Shri Yesuni
Click a stanza to preview here.