ఆ రాత్రిలో నింగిలో ఒక తార
గొప్ప తేజముతో ప్రభవించెను ఆ రేయి
జ్ఞానులు కనుగొనిరి - ఓర్పుతో ఆ తారను వెంబడించి చేరెను బేత్లెహేముకు
ఆ కాలములో ఉన్న జ్ఞానులు - ఖగోళ వింతను వీక్షించిరి
ఏదో జరిగెనని ఈ లోకంలో -
అన్వేషించుచు చేరెను బెత్లేహెం
యూదుల రాజైన - యేసుక్రీస్తును
దర్శించి పూజించి ఆరాధించిరి
బంగారం సాంబ్రాణి బోళమునర్పించిరి
ఆ కాలములో ఉన్న గొల్లలు - రాత్రిజామున మందను కాయుచుండగా
దేవుని దూతోకటి తెలిపెను శుభవార్త -
రక్షకుడేసుని చూచిరి గొల్లలు
లోక రక్షకుడు యేసు క్రీస్తును
కనులారా వీక్షించి సంతోషించిరి
చూచినవి అందరికి చాటించిరి
ఆ కాలములో దూత గణములు - పరలోకమునుండి భువికేతెంచుచు
సర్వోన్నతమైన స్థలములలో నేడు -
దేవునికి మహిమ కలుగును గాక
ఆయనకిష్టులైన మనుష్యులకు భువిపై -
సమాధానము అనుచు దూతలు పాడిరి
గొర్రెల కాపరులు త్వరపడి వెళ్లిరి
బేత్లెహేము గ్రామములో - పశువుల పాకలో
కనులారా బాలుడను - చూచిరి గొల్లలు
Aa rātrilo ningilo oka tāra
Goppa tejamutho prabhavinchenu aa reyi
Jñānulu kanugoniri – ōrputo aa tāra nu vembadinchi
Cherenu Bethlehemuku
Aa kālamulo unna jñānulu – khagōla vintanu veekshiniri
Edō jariginani ee lōkamlo –
Anvėshinuchu cherenu Bethlehem
Yoodula rājayina Yesu Krīstunu
Darshinchi pūjinchi ārādhinchiri
Bangāram, sāmbhrāṇi, bōlamunarpinchiri
Aa kālamulo unna gollalu – rātri jāmun mandanu kāyuchundaga
Devuni duthoḳaṭi telipenu shubhavārtha –
Rakshakudēsuni choochiri gollalu
Lōka rakshakudu Yesu Krīstunu
Kanulāra veekshinchi santōshincheri
Choochina vi andariki chātinchiri
Aa kālamulo dūtha gaṇamulu – paralōkamunundi bhuviketenchuchu
Sarvōnnatamain sthalamulalō nēḍu –
Devuniki mahima kalugunu gāka
Āyanaki shtulaina manushyulaku bhuvipai –
Samādhānamu anuchu dūthalu pādiri
Gorrela kāparulu tvarapadi velliri
Bethlehemu grāmamulō – pashuvula pākalō
Kanulāra bāludanu choochiri gollalu