ఆకాశ మహా-కాశంబులు
పట్టని ఆశ్చర్యకరుడా
కృప జూపి నిబంధనను
నెరవేర్చిన ఉపకారి
కాపాడితివి నడిపితివి
నీ యింటికి మమ్ములను
నీ దాసునికి నీ ప్రజలకు
నీ క్షమను కనుపరచు
నీదు కల్వరి రక్తమున
నీవే కడుగు కరుణామయా
నీతి న్యాయముల కర్త
ప్రీతి తోడ నీ ప్రజలకు
నీతి న్యాయముల నిమ్ము
స్తుతియింప నిరతంబు
రాజులనుగా యాజకులనుగా
మమ్ము చేసిన మహారాజ
విజయమిమ్ము మా విజయుండా
నిజమైన నీ ప్రజలకు
బలపరచు నీ భక్తులను
బలము తోడ ప్రవేశించి
విలువైన నీ రక్షణను
ధరింప చేయుము హల్లెలూయా
Aakāsa mahā-kāśambulu
Pattani āscharyakarudā
Krupa jūpi nibandhananu
Neravērchina upakāri
Kāpāḍitivi naḍipitivi
Nī inti ki mammunu
Nī dāsuniki nī prajalaku
Nī kshamanu kanuparachu
Nīdu Kalvari raktamuna
Nīvē kaḍugu karuṇāmayā
Nīti nyāyamula karta
Prīti tōḍa nī prajalaku
Nīti nyāyamula nimmu
Stutiyimpa niratambu
Rājulanugā yājakulanugā
Mammu chēsina mahārāja
Vijayamimmu mā vijayuṇḍā
Nijamaina nī prajalaku
Balaparachu nī bhaktulanu
Balamu tōḍa pravēśinchi
Viluvaina nī rakshaṇanu
Dharimpa chēyumu Hallelujah
Click a stanza to preview here.