ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు
అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి
స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు
పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ
Ākāśa pakṣulanu chūḍaṇḍi
Avi vittavu avi kōyavu
Gariselalō dāchukōvū
Koṭlalō kūrchukōvu
Anudinamū kāvalasina āhāramu
Andajēyunu vāṭiki ā Dēvuḍu
Kalasikaṭṭugā avi egiri pōtāyi
Kaḍupu nimpu konipōyi marala tirigi vastāyi
Svārthamu vanchana vāṭikundaḍu
Sāṭivāni dōchukōnē manasu undaḍu
Rēpatini gūrichina chinta undaḍu
Pūṭa elā gaḍapālanē bādha undaḍu
Pakṣulanu pōṣinche ā Dēvuḍu
Manuṣyulanu pōṣinchuṭa mānivēyunā
Sṛṣṭilōna manishi bratuku śrēṣṭamu kadā
Prabhuvu tōḍu unḍagā manaku enduku bādha
Click a stanza to preview here.