ఆకాశమా ఆలకించుమా
భూమీ చెవియొగ్గుమా
అని దేవుడు మాటలడుచున్నాడు
తన వేదన నీతో చెబుతున్నాడు
నేను పెంచిన నా పిల్లలే
నా మీదనే తిరగబడిరనీ
అరచేతిలో చెక్కుకున్నవారే
నా అరచేతిపై మేకులు కొడుతూ
నను దూరంగా ఉంచారని
నా పిల్లలు బహు చెడిపోతున్నారని
విస్తారమైన బలులు నాకేల
క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే
కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం
మేకల రక్తం నాకిష్టము లేదు
కీడు చేయ మానాలని
బహు మేలు చేయ నేర్వాలని
పాపిష్టి జనమా, దుష్టసంతానమా
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ
అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు
మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును
ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు
మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును
నన్ను విసర్జించువారు లయమగుదురని
నీరులేని తోటలా నశియింతురని
ఆకాశమా భువికి చెప్పుమా
భూమీ లోకాన చాటుమా
Ākāśamā ālakinchumā
Bhūmī cheviyoggumā
Ani Dēvuḍu māṭalāḍuchunnāḍu
Tana vēdanā nītō chebutunnāḍu
Nēnu penchina nā pillalē
Nā mīdanē tiragabaḍiranī
Arachaetilō chekkukunna vāre
Nā arachaetipai mēkulu koḍutū
Nanu dūraṅgā unchāranī
Nā pillalu bahu cheḍipōtunnāranī
Vistāramaina balulu nākēla
Krovvina dūḍā nāku vekkasamāyē
Kōḍela raktam gorra pillala raktam
Mēkala raktam nākiṣṭamu lēdu
Kīḍu chēya mānālanī
Bahu mēlu chēya nērvālanī
Pāpiṣṭi janamā, duṣṭasantānamā
Cherupu chēyu pillalārā mīku śrama
Akkaralō mī chētulu nā vaipuku chāchinapuḍu
Mimmunu nē chūḍakanē kanulu kappukondunu
Āpadalō mī gontulu nā sannidhi arachinapuḍu
Mī māṭalu vinakundā chevulu mūsukondunu
Nannu visarjinchuvāru layamaguduranī
Nīrulēni tōṭalā naśiyinturanī
Ākāśamā bhuviki cheppumā
Bhūmī lōkāna chāṭumā
Click a stanza to preview here.