ఆరని ప్రేమ ఇది – ఆర్పజాలని జ్వాల ఇది అతి శ్రేష్టమైనది – అంతమే లేనిది అవధులే లేనిది – అక్షయమైన ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
సింహాసనము నుండి – సిలువకు దిగి వచ్చినది బలమైనది మరణము కన్నా – మృతిని గెల్చి లేచినది ఇది సజీవమైనది – ఇదే సత్యమైనది
ఇదే నిత్యమైనది – క్రీస్తు యేసు ప్రేమ ఇది కలువరి ప్రేమ ఇది – క్రీస్తు కలువరి ప్రేమ ఇది
నా స్థానమందు నిలిచి – నా శిక్షనే భరియించి క్రయ ధనమును చెల్లించి – గొప్ప రక్షణ నిచ్చినది నాకు విలువ నిచ్చినది – నన్ను వెలిగించినది
ఆ ఉన్నత రాజ్యమందు – నాకు స్థానమిచ్చినది ఉన్నత ప్రేమ ఇది – అత్యున్నత ప్రేమ ఇది
భూ రాజులు అధిపతులు – రాజ్యాలు అధికారాలు చెరయైనా ఖడ్గమైనా – కరువైనా ఎదురైన ఎవరు ఆర్పలేనిది – ఎవరు ఆపలేనిది
ప్రవహించుచున్నది – ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమిది – యేసు ప్రేమ ప్రవాహమిది
Aarani prema idi – aarpajaalani jwaala idi Ati shreshtamainadi – antame lenidi Avadhule lenidi – akshayamainaa prema idi Kaluvari prema idi – Kristu Kaluvari prema idi
Simhaasanamu nundi – siluvaku digi vachchinadi Balamainadi maranamu kanna – mrutini gelichi lechinadi Idi sajeevamainadi – ide satyamainadi
Ide nityamainadi – Kristu Yesu prema idi Kaluvari prema idi – Kristu Kaluvari prema idi