ఆశ తీర నా యేసు స్వామిని కొలిచెదను
ఆత్మతో సత్యముతో స్తుతించెదను
ఎంత ధన్యము యేసుని వెదకుట ఎంత ధన్యము
ఎంత భాగ్యము యేసుని నమ్ముట ఎంత భాగ్యము
దుప్పి నీటికై ఆశపడునట్లుగా
దేవుని కొరకై ఆశ పడుచున్నాను
దేవుని సన్నిధిని నిత్యముండునట్లుగా
దిన దినమాశతో కనిపెట్టుచున్నాను
లోక ఆశలు లయమైపోవును
లోకులెవ్వరు కాపాడలేరు
లోపాలు సరిచేయు ప్రభువే ఆధారం
లోబడు వారిని పారమున చేర్చును
Click a stanza to preview here.