అద్వితీయుడా కాచుకొంటివి
నీ కౌగిలిలోనే ఒదిగిపోదునయ్యా
నీ ప్రేమకు సాటి లేనేలేదు
నీ ప్రేమను ఎవరు చూపలేరు
మండుచున్న పొదలో నుండి నన్ను దర్శించావు
భయపడకు నేనున్నానని నన్ను ధైర్యపరచావు
ఎన్నికే లేని వాణ్ని బలమైన జనముగ చేసి
నీ మహిమతో నింపావు నీ స్వాస్థ్యమునిచ్చావు
నే నడుచు మార్గములో నా అడుగులు స్థిరపరచి
ధైర్యముతో నింపావు గురియొద్దకు నడచుటకు
ఎదురైన అవరోధాలే ఆశీర్వాదాలు చేసి
నా పైన చూపావు ఎనలేని నీ ప్రేమ
ఇంతగా హెచ్చించుటకు ఏ పాటివాడను
శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావు
నీ శూర కార్యాలు నా యందు కనుపరచి
తండ్రి నీ కౌగిలిలో నన్ను దాచుకున్నావు
Adhvitheeyudaa kaachukontivi
Nee kougililone odigipodunayya
Nee premaku saati lenelēdu
Nee premanu evaru choopalēru
Manduchunna podhalo nundi nannu darshinchaavu
Bhayapadaku nēnunnānani nannu dhairyaparachaavu
Ennike leni vaanni balamainajana muga chesi
Nee mahimatho nimpāvu nee swāsthyamunichchaavu
Nē naduchu maargamulo naa adugulu sthiraparachi
Dhairyamutho nimpāvu guriyoddaku nadachutaku
Eduraina avarodhaale aasheervaadaale chesi
Naa paina choopaavu enalēni nee prema
Inthagā hechchinchutaku ē pāṭivāḍanu
Shaashvatha prematho nannu preminchaavu
Nee shoora kaaryaalu naa yandu kanuparachi
Tandri nee kougililo nannu daachukunnāvu
Click a stanza to preview here.