అందాల బాలుడు ఉదయించినాడు
లోకాలు వెలిగించు నీతి సూరీడు (2)
రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను
ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల||
భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి
ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2)
గొల్లలము మేము కల్లలు ఎరుగము (2)
కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో||
తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి
లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2)
దారి చూపే తార రారాజునే జేర (2)
మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో||
తనలోని వెలుగంత పంచేటి పావనుడు
మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2)
చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2)
నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||
Andala baaludu udayinchinadu
Lokaalu veliginchu neeti sooridu (2)
Randayyo mana koraku raaraju puttenu
Premanu panchēti rakshananu techhenu (2) ||Andala||
Bheetilli poyamu aa velugune jusi
Ennadu erugani tejasune gaanchi (2)
Gollalamu memu kallalu erugamu
Kallara juusamu tejomayuni momu (2) ||Randayyo||
Toorupu jnaanulamu velige taaranu jusi
Lekkalenno vesi maaharaju - netikamu (2)
Daari choope taar raarajune jera
Mokkamu mokarilli baalunni manasaara (2) ||Randayyo||
Tanaloni veluganta panchēti paavanudu
Manaloni paapamanta teeseyu rakshakudu (2)
Cheekatlu tolagi udayinchinadu nēdu
Nee tappulennu unna mannishtadu reḍu (2) ||Randayyo||
Click a stanza to preview here.