అందాల చిన్ని గూటిలోన – పుట్టిన పిచ్చుకను చిన్ని రెక్కలు చాచి నేను – నింగిలో ఎగిరాను ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం – అన్నీ ఇచ్చింది యేసే ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ – జత కలిపి పాడమ్మ
లేచే ప్రతి ఉదయం – పాడే నా ప్రాణం పదిలముగా కాచే – ప్రభువే నా లోకం
విత్తలేదు నేను కోయలేదు – కొట్లలో కూర్చుకోలేదు కొరతంటూ నాకు తెలియదు – కలతంటూ నాకు లేనేలేదు పరలోక తండ్రి నా కొరకు అన్నీ – సమకూర్చుచున్నాడులే
పిచ్చుక విలువ కాసే ఐనా – రాలునా తండ్రి కాదన్నా తన రూపునే మీకు ఇచ్చుకున్న – తన కన్నా యెవరన్నా ప్రేమించునా? శ్రేష్టులైన మీరు భయపడ తగునా – మీ తండ్రి తోడుండగా
Andala chinni gootilon – puttina picchukunu Chinni rekkalu chaachi nenu – ningilo egiranu Ee chinni jeeviki roopam praNam – anni ichindi Yese Prati komma remmalo o koyilamma – jatha kalipi paadamma