అపరాధిని యేసయ్యా
కృపజూపి బ్రోవుమయ్యా
నెపమెంచకయె నీ కృపలో
నపరాధములను క్షమించు
సిలువకు నిను నే గొట్టి
తులువలతో జేరితిని
కలుషంబులను మోపితిని
దోషుండ నేను ప్రభువా
ప్రక్కలో బల్లెపుపోటు
గ్రక్కున పొడిచితి నేనే
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితి వయ్యో
ముళ్ళతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిడితి
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి
దాహంబు గొనగా చేదు
చిరకను ద్రావ నిడితి
ద్రోహుండనై జేసితినీ
దేహంబు గాయంబులను
ఘోరంబుగా దూరితిని
నేరంబులను జేసితిని
కౄరుండనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత
అపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా
Aparaadhini Yesayyaa
Krupa joopi brovumayyaa
Nepamenchakaye nee krupalo
Naparaadhamulanu kshaminchu
Siluvaku ninu ne gotti
Tuluvalato jeritini
Kalushambulanu mopitini
Doshunda nenu prabhuvaa
Prakkalo ballepu potu
Grakkuna podichiti nene
Mikkili baadhinchitini
Makkuva joopiti vayyo
Mullato kireetambu
Nalli nee shiramuna niditi
Naa valla neramaaye
Challani dayagala tandri
Daahambu gonagaa chedu
Chirakanu draava niditi
Drohundanai jesitinee
Dehambu gaayambulanu
Ghorambugaa dooritini
Nerambulanu jesitini
Kroorundanai gottitini
Ghorampu paapini devaa
Chinditi raktamu naakai
Pondina debbala cheta
Apanindalu mopitinayyo
Sandehamele nayyaa
Shikshaku paatrudanayyaa
Rakshana dechchitivayyaa
Akshaya bhaagyamu niyya
Mokshambu joopitivayyaa
Click a stanza to preview here.