భజన చేయుచు భక్తపాలక
ప్రస్తుతింతు నీ నామమును
వృజినములపై జయము నిచ్చిన
విజయుడా నిను వేడుకొందు
దివ్య పదవిని విడిచి నీవు
దీనుడవై పుట్టినావు
భవ్యమైన బోధలెన్నో
బాగుగా ధర నేర్పినావు
నరుల గావను పరమునుండి
ధరకు నీవు వచ్చినావు
పరుడ నైన నా కొరకు నీ
ప్రాణము నర్పించినావు
చెడినవాడ నైన నన్ను
జేరదీసి ప్రోచినావు
పడిన నాడు గోతి నుండి
పైకి లేవనెత్తి నావు
ఎంత ప్రేమ ఎంత దయ
ఎంత కృప యేసయ్య నీకు
ఇంతయని వర్ణింప నిలలో
నెవనికిని సాధ్యంబు కాదు
Bhajana cheyuchu bhaktapalaka
Prasthutintu nee naamamunu
Vrujinamulapai jayamu nichhina
Vijayudaa ninnu vedukondu
Divya padavini vidichi neevu
Deenudavai puttinavu
Bhavyamaina bodhalenno
Baaguga dhara nerpinavu
Narula gaavanu paramunundi
Dharraku neevu vachchinaavu
Parudu naina naa koraku nee
Praanamu narpinchinaavu
Chedinavada naina nannu
Jeradisi prochinaavu
Padina naadu goti nundi
Paiki levanetthi naavu
Entha prema entha daya
Entha krupa Yesayya neeku
Intayani varnincha nilalo
Nevanikini saadhyambu kaadu
Click a stanza to preview here.