భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు
భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు
Bhayamu ledu manaku
Ikapai eduru vachchu gelupu
Adigō Yesu pilupu
Vinumaa paramu cheru varaku
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
Phalitamēdainaa Prabhunu veedaku
Kashtamentainaa kalata chendaku
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని
Alupu lekunda parugu saagani
Shōdhanalu ninnu choosi bedarani
సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని
Sandhinchina baanamalle nee guri konasaagani
Mana tandri vaagdhaanālē oopirigaa maarani
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని
Kashtaalē metluga maari Yesulo ediginchani
Tana vaakyam neelo veligi cheekati tholaginchani
మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము
Mandinche aggi thōnē merayunu bangaaramu
Shōdhanala kolimilōnē balapadu vishwaasamu
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా
Nee tarapuna yuddham chēse Yehova nee anda
Tholagipōku aa maarganni tana aajñanu vinakunda
కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము
Kanalēdaa siluvalōna Yesu raaju kashtamu
Taanondina shramala dwaaraa nashiyinche paapamu
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి
Nee shramala kaalam lōnē manasu dhrudamu kaavaali
Tirigi neelō puttē paapam beejamu nashiyinchaali
ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు
Priyamaina putrunni manakai naliginchina Dēvudu
Appaginchalēdaa sakalam sarva-shaktimantudu
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు
Tana sannidhi raavaalantoo ninnu kōrustunnaadu
Neeti neelō penchētanduku tapana padutoo unnaadu