చాలదు చాలదయ్యా నిన్ను ఎంత స్తుతించినా చాలదయ్యా
తీరదు తీరదయ్యా నీపై నాకున్న ఆశ తీరదయ్యా (2)
యేసయ్యా యేసయ్యా నా ప్రాణ ప్రియుడవు నీవయ్యా (2) || చాలదు ||
1 ఇంతవరకు నీదు కృపలో కాచితివి కనుపాపలా
నా జీవిత యాత్రను నడిపించుము నా దేవా (2) || యేసయ్యా ||
1 వర్ణింపలేని గొప్ప కార్యములు ఎన్నో ఎన్నో చేసావయ్యా
వందనాలని చెప్పుటకు వేయి నోళ్ళు చాలవయ్యా (2) || యేసయ్యా ||
1 సూర్య చంద్ర నక్షత్రాలు నిన్నే పాడుచున్నావయ్యా
సమస్త జీవకోటి నిన్నే సేవించాలయ్యా (2) || యేసయ్యా
Click a stanza to preview here.