చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని యేసు..
నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే యేసు..
సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను
మా రోగములను – భరియించుటకు
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే యేసు..
Choochiti nee momupai – chindina rakthamu
Talachiti nee premanu – madiki andanidaye
Raja makutamu maaripooye – mull makutamuga
Simhasaname siluvaga mari – shikshaku guriyayega
Parimiti leena kalavari premanu – parihaasamu chesire
Aa premane rigi nee paada sewaye – chaalani nee chenta cheritini Yesu..
Nelapai olikina nee rakthadharale – prati paapini kadigenu
Aa rakthadharale paapiki margamai – paramuku pravahinchenu
Matti dehamunu – mahimaga marchutaku
Maapai neekunna sankalpa premanu – parihaasamu chesire Yesu..
Siluvlo chindina rakthapu jallulu – prati rogini takenu
Chitikina dehamunu olikina rudhiramu – paramoushadhamayenu
Maa rogamulanu – bhariyinchutaku
Maapai neekunna enaleni premanu – avaheshalu chesire Yesu..
Click a stanza to preview here.