అల్పుడను నేను - అనాధను నేను దరిచేరి ఆదరించుమయా… దేవా నాదేవా - నా యేసయా (2)
ఎన్నో ఆశలతో - జీవించుచుండగా అంతా నావారేనని - నమ్మియుండగా ప్రేమించినవారే -నను మోసగించి నే నమ్మినవారే - నా చేయి విడచి (2) ఒంటరిగా - చీకటిలో - నిలిచియుంటిని (2)
నా జీవితం - సుడిగుండాలవలయం ఉహించనిమలుపులే - నిత్య ప్రాప్తము (2) అనుకున్నవి జరగక - అనుకోనివి జరుగుతూ అందరు విడచిన - అనాధనైతిని (2) చావలేక - బ్రతకలేక - కుములుచుంటిని (2)