దివిలో వేడుక – ఊరంతా పండుగ – నేడే రారాజు పుట్టెనే
ఇలలో జాడగా – ఆ నింగీ తారక – వెలిసే ఈ వింత చూపగా
మహా సంతోషమే – ఆహా ఆనందమే
ఆహా ఈ రేయిలో – ఓహో ఉల్లాసమే
ఇల మెస్సయ్య – జన్మించినాడుగా
మన యేసయ్య – ఉదయించినాడుగా
మహారాజు – మన యేసు
నిన్నే కోరీ – ఇలా వచ్చెనే
జగాలేలే – మన యేసు
నిన్నే చేర – దిగి వచ్చెనే
దేవ దేవుడే – మరియ తనయుడై
ధరలో దీనుడై – పుట్టే పుణ్యుడై
పరిశుద్ధాత్ముడే – పాపరహితుడై
ప్రేమపూర్ణుడే – పరమ జీవమై
లోకాన్ని వెలిగించ వచ్చాడుగా
నిను దీవించి తన ప్రేమ చూపాడుగా
దారే చూపంగ దేవుడే
దయతో దీపంగ నిలిచెనే
ఆడే గొల్లలు – పాడే దూతలు
వచ్చిరి జ్ఞానులు – వేడిరి యేసుని
ఆ పశుపాకలో – పొంగే సంబరం
మనకు రక్షణై – యేసు ఈ దినం
పాపాన్ని తొలగించ వచ్చాడుగా
నిను కరుణించి తన జాలి చూపాడుగా
కృపతో కాపాడ వచ్చెనే
చెలిమై చల్లంగ చూసెనే
Divilo veduka – oorantaa panduga – nede raaraju puttene
Ilalo jaadaga – aa ningi taaraka – velise ee vinta choopaga
Mahaa santoshamé – aahaa aanandamé
Aahaa ee reyilo – oohoo ullaasamé
Ila Messayya – janminchinaadugaa
Mana Yesayya – udayinchinaadugaa
Maharaaju – mana Yesu
Ninne koori – ila vacchene
Jagalelee – mana Yesu
Ninne chera – digi vacchene
Deva Devudé – Mariya tanayudai
Dharalo deenudai – putte punyudai
Parishuddhaatmude – paaparahitudai
Premapoornude – parama jeevamai
Lokaanni veligincha vacchaadugaa
Ninu deevinchi tana prema choopaadugaa
Daare choopanga Devude
Dayatho deepanga nilichene
Aade gollalu – paade doothalu
Vachchiri jnaanulu – vediri Yesuni
Aa pashupaakalo – ponge sambaram
Manaku rakshanai – Yeshu ee dinam
Paapanni tolagincha vacchaadugaa
Ninu karuninchi tana jaali choopaadugaa
Krupatho kaapaada vacchene
Chelimai challanga choosene
Click a stanza to preview here.