1. ఈ సంఘపు బునాది - క్రీస్తేసాధీశుడే దక్కించె యేసు దీని - వాక్కాపుల్ రెట్టించే పై నుండి వచ్చి యేసు - పెండ్లాడె నీమనే కోరుచు రక్తమిచ్చి - కొనె నీ కన్యనే
2. ఒక్కడే దేవుడిందు - ఒక్కటే మార్గము ఒక్కటే జన్మ మిందు - ఒక్కటే సత్యము ఒక్క ప్రసాదమిందు - ఒక్క కష్టంబులే నిరీక్షణొక్కటిందు - నిరంత ప్రాప్తికే
3. అసత్య మార్గమంచు - ననేకుల్ నవ్వినన్ విభాగమై శ్రమంబుల్ - విశేష మొందినన్ సుభక్తుల్ వేడుచుంద్రు - అభయకాంతికై యీ నిందలెల్ల బోయె - నానంద నాటికై
4. కఠిన దుఃఖ బాదల్ - కలిగిన నోర్చుచు విభవానంద ప్రాప్తి - లభింపగోరుచు ఆ స్వర్గ పంక్తిజేరి - యానంద మొందుచున్ యీ సంఘ మేసు గూడి - విశ్రాంతి బొందును
1. Ee sanghapu bunadhi - Kreesthe sādheeshudē Dakkinche Yesu dheeni - vaakkaapul rettinchē Pai nundi vachchi Yesu - pendlaade neemane Kooruchu raktamichchi - kone nee kanyane
2. Okkade devudindu - okkate maargamu Okkate janmamindu - okkate satyamu Okka prasaadhamindu - okka kashtambulē Nireekshana okkatindu - niranta praaptikē
3. Asatya maargamanchu - nanēkul navvinan Vibhaagamai shramambul - visēsha mondinan Subhaktul veduchundru - abhayakaantikay Yee nindalella boye - naananda naatikay
4. Kathina dhukhabaadal - kaligina norchuchu Vibhavaananda praapti - labhimpagoruchu Aa swarga panktijerī - yānanda monduchun Yee sangha Mesu goodi - vishrānthi bondunu
⬅
➡
Click a stanza to preview here.