ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలనాడక తనదు జాలి జూపినదా
||ఈలాటిదా||
1. ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచును నే దరిఁ గానకు
డన్ కనికరముఁ బెంచి నా యందు వేగఁ గొని పోవ నా మేలు కొర
కిందు వచ్చె ||ఈలాటి||
2. పెనుగొన్న దుఃఖాబ్ధిలోన నేను మునిఁగి కుములుచు నేడు పునగుందు
నపుడు నను నీచుఁడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి
నీతిఁజూపించె ||ఈలాటి||
3. నెమ్మి రవ్వంతైన లేక చింత క్రమ్మిపొగలుచు నుండ గా నన్ను ఁ
జూచి సమ్మతిని ననుఁ బ్రోవఁ దలఁచి కరముఁ జాఁచి నా
చేయిబట్టి చక్కఁగా బిలిచె ||ఈలాటి||
4. పనికిమాలిన వాఁడనైన నేను కనపరచు నాదోష కపటవర్తనము
మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ మును నాకుఁ జూపె
||ఈలాటి||
5. నా కోర్కె లెల్ల సమయములన్ క్రింది లోక వాంఛల భ్రమసి
లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నా కొసంగె
జీవింప నా రక్షకుండు ||ఈలాటి||
6. శోధనలు ననుఁ జుట్టినపుడు నీతి బోధ నా మనసులోఁ బుట్టించి
పెంచి బాధ లెల్లను బాపి మాపి యిట్టి యాదరణఁ జూపెనా యహహ
యేమందు ||ఈలాటి||
Eelaatidā Yesu Prema
Eelaatidā Yesu prema nannu thoolanādaka tanadu jaali juupinadā
||Eelaatidā||
Enaleni paapakuupamunu nenu thaniki minukuchunu ne dari gaunaku
Dan kanikaramu benchi naa yandu vego goni povu naa melu kora
Kindu vache ||Eelaati||
Penugonna dukhābhdhilonu nenu munigi kumuluchu nedu punagundu
Napudu nanu neechundani troyalekka tanadu nenaru naa kagupachi
Neetijuupinche ||Eelaati||
Nemi ravvantaaina leka chinta krammipogalu nundu gaa nannu
Juchi sammathini nanu brova dalachi karamu jaanchi naa
Cheyibatti chakkaaga biliche ||Eelaati||
Panikimaalina vaadanaine nenu kanaparachu naadosha kapata vartanamu
Manasu nunchaka taapapadaka intha ghanamaina rakshana munu naaku juupe
||Eelaati||
Naa korike lella samayamulan krindi loka vaanchala bhramasi
Longedu velan chekurchi dridhamu chittamunan shubhamu naa kosange
Jeevimp na rakshakundu ||Eelaati||
Shodhanalu nanu juttinapudu neeti bodha naa manasulo buttinchi
Penchi baadha lellanu bapi maapi itti yaadarana juupena yahaha
Yemandu ||Eelaati||
Click a stanza to preview here.