గాడాంధకారపు లోయలో
నే సంచరించిన వేళలో
అపాయమేమియు రానీయక
ఉన్నావు తోడుగ నా త్రోవలో
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా ఆశ్రయ దుర్గము నీవే
నా బలమైన శైలము నీవే
నా రక్షణ శృంగము నీవే
నా శిక్షను భరియించితివే
పచ్చిక గల చోట్లలో నిలిపావు
శాంతి జలములందు నన్ను నడిపావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా ఎత్తైన కోట నీవే
నే నడిచే ప్రతి చోట నీవే
నా రక్షణకర్తా నీవే
నా జీవన దాతా నీవే
నూనెతో నా తలను అంటావు
నా గిన్నెను పొర్లి పారజేసావు (2)
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి (2)
నా మొరను ఆలించావే
నీ వరములు నాకొసగావే
నా పరమ తండ్రివి నీవే
నీ కరమున నను దాచావే
చీకటి బ్రతుకును వెలిగించావు
మరణపు భయమును తొలగించావు
యేసయ్య నీవే మా కాపరివి
ఏమి లేమి లేక కాపాడితివి
నా త్రోవకు వెలుగు నీవే
నా నావకు చుక్కాని నీవే
నను కావగ ఏతెంచితివే
కొనిపోవగ రానున్నావే
GaaDhaandhakaarapu lōyalō
Nē sancharinchina vēḷalō
Apaayāmēmiyu raanīyaka
Unnaavu thōDuga naa thrōvalō
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa āshraya durgamu nīvē
Naa balamaina shailamu nīvē
Naa rakshaṇa shṛungamu nīvē
Naa shikshanu bhariyinchithivē
Pacchika gala chōṭlalō nilipaavu
Shaanthi jalamulandu nannu naDipāvu
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa ettaina kōṭa nīvē
Nē naDichē prati chōṭa nīvē
Naa rakshaṇakarthā nīvē
Naa jeevana daathā nīvē
Nūnethō naa thalanu antaavu
Naa ginnenu porli pārajesāvu (2)
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi (2)
Naa moranu ālinchāvē
Nī varamulu naakosagāvē
Naa parama thandrivi nīvē
Nī karamuna nanu dāchāvē
Cheekaṭi brathukunu veliginchāvu
Maraṇapu bhayamunu tholaginchāvu
Yēsayya nīvē maa kaaparivi
Ēmi lēmi lēka kaapaaDithivi
Naa thrōvaku velugu nīvē
Naa naavaku chukkāni nīvē
Nanu kaavaga ēthenchithivē
Konipōvaga rānunnāvē
Click a stanza to preview here.