గాలించి చూడరా మేలైనది
నీలోన ఉన్నదా ప్రేమన్నది
ప్రేమన్నది నీ పెన్నిధి
నీలోన ఉన్నదా ప్రేమన్నది
దేవ దూతలా భాషలు దేనికి
కరుణ లేని నీ కఠిన ముఖానికి
పైకి భక్తి కలిగినా చాలదు
ప్రేమ లేని భక్తి అది వ్యర్ధము
బీదలకు ఆస్తినిచ్చి పంచినా
కార్చుటకు శరీరం మార్చినా
రేయి పగలు ఏడ్చుచు ప్రార్ధించినా
రిక్తుడవే నీ శ్రమంతా వ్యర్ధము
కొండలు పెకిలించు విశ్వాసివా
గుండెలు కరిగించు సహవాసివా
ప్రేమలేని విశ్వాసము శూన్యము
చివరికది మరో మృతము తథ్యము
స్వస్థపరచు వరాలున్న దేనికి
స్వస్థతయే లేదు నీకు నేటికీ
ప్రేమలేని వరాలన్ని సున్నా
క్షేమమేదిరా నీకు రన్నా
గణ గణ మ్రోగెడి లోహానివా
కంచువై మ్రోగెడి మేళానివా
డంబమెరుగదు మోగదు మేలిమి
పొంగదు ప్రేమ ఋణము తాలిమి
ధర్మశాస్త్రమంతటికాధారము
దశాజ్ఞలలో గొప్ప సారము (2)
ప్రేమయే అది యేసుని రూపము
లేనిదైతే వచ్చుఁ ఘోర శాపము
ప్రేమ విశ్వాసము నిరీక్షణ
ఓ ప్రియుడా నీకిచ్చును రక్షణ
వీటిలో ప్రేమయే శ్రేష్టము
పాటించితే నీకింక మోక్షము
Gālin̄ci cūdārā mēlainadi
Nīlōna unnadā prēma nnadi
Prēma nnadi nī pennidhi
Nīlōna unnadā prēma nnadi
Dēva dūtala bhāṣalu dēniki
Karuna lēni nī kaṭhina mukhāniki
Paiki bhakti kaliginā chāladhu
Prēma lēni bhakti adi vyardhamu
Bīdhalaku āstinichci pancinā
Kārcutaku śarīram mārcinā
Rēyi pagalu ēḍchucu prārthin̄canā
Riktudavē nī śramantā vyardhamu
Kondalu peki lin̄cu viśvāsivā
Gundelu karigin̄cu sahavāsivā
Prēmalēni viśvāsamu śūnyamu
Civarikadi marō mr̥tamu tathyamu
Svasthaparacu varālunna dēniki
Svasthatayē lēdu nīku nēṭikī
Prēmalēni varālan̄ni sunnā
Kṣēmamēdirā nīku rannā
Gaṇa gaṇa mrogēḍi lōhānivā
Kancuvai mrogēḍi mēlānivā
Ḍambamerugadhu mrogadhu mēlimi
Pongadhu prēma ṛṇamu tālimi
Dharmashāstramantatikādhāramu
Daśājñalalō goppa sāramu (2)
Prēmayē adi Yēsuni rūpamu
Lēnidaite vaccuṁ ghōra śāpamu
Prēma viśvāsamu nirīkṣaṇa
Ō priyuḍā nīkicchunu rakṣaṇa
Vīṭilō prēmayē śrēṣṭhamu
Pāṭincitē nīkinka mōkṣamu
Click a stanza to preview here.