ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము
Ghanamainavi nee karyamulu naa yedala
Sthiramainavi nee alochanalu naa Yesayya
Krupalanu ponduchu krutagnatha kaligi
Stutularpinchedanu annivelala
Anudinamu nee anugrahamē
Aayushkaalamu nee varamē
Ye tegulu sameepinchaniyaka – ye keedayna daricheraniyaka
Aapadalanni tolage varaku – aatmalō nemmadi kalige varaku
Naa bharamu mosi – baasataga nilichi – aadarinchitivi
Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
Naaku etthaina kotavu neeve – nannu kaapaadu kedemu neeve
Aashrayamaina bandavu neeve – shaashvata krupakaadhaaramu neeve
Naa pratikshanamunu neevu – deeven
aga maarchi – nadipinchuchunnavu
Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
Nee krupa thappa verokati ledaya – nee manasulō nenunte chālayā
Bahu kaalamuga nenunna sthitilō – nee krupa naa yeda chālunantive
Nee arachetulō nanu – chekkukuntivi – naakemi koduva
Ee stuti mahimalu neeke – chellinchedanu – jeevitaantamu
Click a stanza to preview here.