గుండె బరువెక్కిపోతున్నది
ప్రాణము సొమ్మసిల్లుచున్నది
నా మనసేమో కలవరపడుచున్నది
యేసయ్యా.. ఆదరించ రావా
యేసయ్యా.. బలపరచ రావా
ప్రాకారము లేని పురముగా నేనుంటిని
ఆదరణ లేక దిగులుతో నేనుంటిని
నెమ్మది లేదాయెనే – శాంతి కరువాయెనే
యేసయ్యా.. ఆధారం నీవే కదా
యేసయ్యా.. నా కాపరి నీవే కదా
అంధకారంలో నా దీపము ఆరిపోయెనే
అరణ్య రోదనలో ప్రాణము సొమ్మసిల్లెనే
దినదినము నేను కృంగుచున్నాను
యేసయ్యా.. వెలిగించగ రావా
యేసయ్యా.. లేవనెత్త రావా
ఎక్కడ చూసిననూ నెమ్మది లేదాయెనే
ఎవరిలో చూసిననూ ప్రేమ కరువాయెనే
ఆత్మల భారముతో మూల్గుచున్నానయ్యా
యేసయ్యా.. దర్శించ రావా
యేసయ్యా.. ప్రేమతో నింపుమయా
Gunde baruvekkipotunnadi
Praanamu sommasilluchunnadi
Naa manasemō kalavarapaduchunnadi
Yesayya… aadarincha raavaa
Yesayya… balaparacha raavaa
Praakaaraṁ lēni puramugaa nēnunṭini
Aadarana lēka digulutō nēnunṭini
Nemmadi lēdaayene – shaanthi karuvaayene
Yesayya… aadhaaram nīvē kadaa
Yesayya… naa kaapari nīvē kadaa
Andhakaaramlō naa deepamu aaripōyene
Aranya rōdanalō praanamu sommasillene
Dinadinamu nēnu krunguchunnaanu
Yesayya… veliginchaga raavaa
Yesayya… lēvanettha raavaa
Ekkada choosinanu nemmadi lēdaayene
Evarilō choosinanu prema karuvaayene
Aathmala bhaaramutō moolguchunnaanayyaa
Yesayya… darshincha raavaa
Yesayya… premmatō nimpumayyaa
Click a stanza to preview here.