హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా
సిల్వధరా – పాపహరా – శాంతికరా
శాంతి సమాధానాధిపతీ
స్వాంతములో ప్రశాంతనిధీ
శాంతి స్వరూపా జీవనదీపా
శాంతి సువార్తనిధీ
తపములు తరచిన నిన్నెగదా
జపములు గొలిచిన నిన్నెగదా
విఫలులు చేసిన విజ్ఞాపనలకు
సఫలత నీవెగదా
మతములు వెదకిన నిన్నెకదా
వ్రతములుగోరిన నిన్నెగదా
పతితులు దేవుని సుతులని నేర్పిన
హితమతి వీవెగదా
పలుకులలో నీ శాంతికధ
తొలకరి వానగా కురిసెగదా
మలమల మాడిన మానవ హృదయము
కలకలలాడె కదా
కాననతుల్య సమాజములో
హీనత జెందెను మానవత
మానవ మైత్రిని సిల్వ పతాకము
దానము జేసెగదా
దేవుని బాసిన లోకములో
చావుయే కాపురముండె గదా
దేవునితో సఖ్యంబును జగతికి
యీవి నిడితివి గదా
పాపము చేసిన స్త్రీని గని
పాపుల కోపము మండె గదా
దాపున జేరి పాపిని బ్రోచిన
కాపరి వీవెగదా
ఖాళీ సమాధిలో మరణమును
ఖైదిగ జేసిన నీవే గదా
ఖలమయుడగు సాతానుని గర్వము
ఖండనమాయె గదా
కలువరిలో నీ శాంతి సుధా
సెలయేరుగ బ్రవహించె గదా
కలుష ఎడారిలో కలువలు పూయుట
సిలువ విజయము గదా
He Prabhu Yesu, He Prabhu Yesu, He Prabhu Devasuta
Silvadhara – Paapahara – Shaantikaraa
Shaanti samaadhaanaadhipatee
Swaantamulo prashaanthanidhee
Shaanti swaroopa jeevanadeepa
Shaanti suvaartanidhee
Tapamulu tarachina ninnogada
Japamulu golichina ninnogada
Viphululu chesina vijnapanalaku
Saphalata neevegada
Matamulu vedakina ninnekada
Vratamulu gorina ninnogada
Patitulu devuni suthulani nerpina
Hitamati veevugada
Palukulalo nee shaantikadha
Tholakari vaanaga kurisugada
Malamala maadina maanava hrudayamu
Kalakalalada kadaa
Kaananatulya samaajamulo
Heenata jendenu maanavata
Maanava maitrini silva pataakamu
Daanamu jesugada
Devuni basina lokamulo
Chaavu ye kaapuru munde gada
Devuni tho sakhyambu jagatiki
Yeevi niditivi gada
Paapamu chesina stree ni gani
Paapula kopamu mande gada
Daapunu jeri paapini brochina
Kaapari veevugada
Khaali samaadhilo maranamunu
Khaidiga jesina neeve gada
Khalamayu satanuni garvamu
Khandanamaye gada
Kaluvaarilo nee shaanti sudha
Selayaruga bravahinchaga
Kalusha edaarilo kaluvalu pooyuta
Siluva vijayamu gada
Click a stanza to preview here.