హృదయమంతా పాప భారమే - వినబడుతుంది మరణ మృదంగమే
కరువాయే నిద్ర హారమే - చేరువాయే చెడు స్నేహమే
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నీ పనిలో నడిపించు
సొలొమోనుకు ఉన్న జ్ఞానమే నాకున్నను
సమ్సోనుకు ఉన్న బలమే నాదైనను
నులివెచ్చని బ్రతుకుతో పొందలేను నిత్యజీవం
అయినా తెలిసి తెలిసి పడిపోతిని
-లేవలేక నేను నిను చేరితి
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో గాయకుడనై నేనున్ననూ..
నీ దివ్య వాక్యమును బాగుగా నేను యెరిగి యున్నను
నీ సన్నిధిలో బోధకుడనై నేనున్ననూ..
వదలకుంటే పాపమును అనుభవింతు నిత్యనరకం
అయినా నిన్ను విడచి తప్పిపోతినే
తిరిగొచ్చిన కుమారుడనైతిని
ప్రభువా.. నన్ను కరుణించు క్షమియించు విడిపించు
నన్ను నీకై వెలిగించు నా తుది శ్వాస వరకు నీ పనిలో నడిపించయా....
Hridayamantaa paapa bhaarame – vinabadutundi marana mrudangame
Karuvāye nidra haarame – cheruvāye chedu snehame
Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu nee panilo nadipinchu
Solomonuku unna jñaaname naakunnanu
Samsonuku unna balame naadainanu
Nulivechani bratukuto pondalenu nityajeevam
Ayinaa telisi telisi padipotini
Levalēka nēnu ninu cheriti
Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu
Nee sannidhilo gaayakudanai nēnunnanu..
Nee divya vaakyamunu baagugaa nēnu erigi unnanu
Nee sannidhilo bodhakudanai nēnunnanu..
Vadalakunte paapamunu anubhavintu nityanarakam
Ayinaa ninnu vidachi tappipotinē
Tirigochchina kumaarudanaaitini
Prabhuvaa.. nannu karuninchu kshamiyinchu vidipinchu
Nannu neekai veliginchu naa thudi shwaasa varaku nee panilo nadipinchayaa....
Click a stanza to preview here.