నా పక్షముగా నీవు ఉంటే విరోధి ఎవరు? (2) యేసయ్యా యేసయ్యా, నా విజయం నీవేగా యేసయ్యా యేసయ్యా, జయమిచ్చే నా దేవా (2)
1. ఒంటరిగా నేను పడినపుడు, ఎవరు లేని స్థితిలో నా మోరుని ఆలకించి, లేవనెత్తిన తండ్రి (2) నా అడుగులు స్థిరపరచి, నా ద్వజముగ నీవుండి వ్యధిని ఒడించి, నన్ను రాజుగా చేసినావు
2. ఎన్నికే లేని నన్ను, నీ సేవకై పిలిచినావు నీ ఆత్మతో నన్ను నింపి, యోగ్యునిగా మార్చినావు (2) ప్రతి కీడును తొలగించి, సమస్తం సమకూర్చి వాగ్దానము నెరవేర్చి, నీ స్వాస్థ్యము నాకిచ్చినావు
దేవా, నీవుంటే చాలయ్యా, పోషించె నా తండ్రి నీవేగా కడవరకు నీవుంటే చాలయ్యా, పోషించె నా తండ్రి నీవేగా