జయ సంకేతమా దయాక్షేత్రమా
నను పాలించు నా యేసయ్యా
అపురూపము నీ ప్రతి తలపు
అలరించిన ఆత్మీయ గెలుపు
నడిపించే నీ ప్రేమ పిలుపు
నీ ప్రేమ నాలో ఉదయించగా-నా కొరకు సర్వము సమకూర్చెనే
నన్నేల ప్రేమించ మనస్సాయెను - నీ మనస్సెంతో మహోన్నతము
కొంతైనా నీ ఋణము తీర్చేదెలా - నీవు లేక క్షణమైనా బ్రతికేదెలా
విరిగినలిగిన మనస్సుతోనిన్నే - సేవించెద నా యజమానుడా
నిలిచెను నా మదిలో నీ వాక్యమే - నాలోన రూపించే నీ రూపమే
దీపము నాలో వెలిగించగా - నా ఆత్మదీపము వెలిగించగా
రగిలించే నాలో స్తుతి జ్వాలలు - భజియించి నిన్నే కీర్తింతును
జీవిత గమనం స్థాపించితిని - సీయోను చెర నడిపించుమా
నీ కృప నాయెడల విస్తారమే - ఏనాడూ తలవని భాగ్యమిది
నీ కృప నాకు తోడుండగా - నీ సన్నిధియే నాకు నీడాయెను
ఘనమైనకార్యములు నీవుచేయగా - కొదువేమిలేదాయె నాకెన్నడు
ఆత్మబలముతో నను నడిపించే - నా గొప్ప దేవుడవు నీవేనయ్య
బహు గొప్పదేవుడవు నీవేనయ్య
aya sanketamaa dayakṣetramaa
Nanu paalinchu naa Yesayya
Apurupamu nee prati thalapu
Alarinchina aathmiya gelupu
Nadipinche nee prema pilupu
Nee prema naalo udayinchaga – naa koraku sarvamu samakurchene
Nannele premincha manassayenu – nee manassemtho mahonnatamu
Konthaina nee runamu theerchedela – neevu leka kshanamainaa bratikedela
Viriginaligina manassuto ninnē – sevicheda naa yajamaanuda
Nilichenu naa madilo nee vaakyame – naalon roopince nee roopame
Deepamu naalo veliginchaga – naa aathmadeepamu veliginchaga
Ragilinche naalo stuti jwaalalu – bhajhinchi ninnē keerthinchu
Jeevita gamanam sthaapinchitini – Seeonu cher nadipinchuma
Nee krupa naayedala vistaarame – enadoo talavani bhagyamidi
Nee krupa naaku todu undaga – nee sannidhiye naaku needaye
Ghanamainakaryamulu neevucheyaga – koduvemiledaaye naakennu
Aathmabalamuto nanu nadipinche – naa goppa Devudavu neevenaa-yya Bahu goppadevudavu neevenaa-yya
Click a stanza to preview here.