కాలమెల్ల మారినా - మారడు నా యేసు నాధుడు భూమి మార్పు చెందినా - నా స్వామి యేసు మాట తప్పడు పరలోక మహిమను - దివిదూత గణమును విడనాడి నన్ను వేడుక వచ్చెను ఆ ఘోర సిలువను - నా కొరకు మోసెను పాపి కొరకు ప్రాణమిచ్చెను (కా)
1. మరణ ముల్లును విరచివేసెను - సమాధి నుండి తిరిగి లేచెను కరుణ తోడను - నా కడకు చేరెను నా ప్రాణ నాధుడు - నా ప్రేమ పూర్ణుడు నాదు బ్రతుకు మార్చి వేసెను (కా)
2. మంచి కాపరి - నా చెంత చేరెను లేమిని లేకుండా చేసెను దారి తప్పిన - నన్ను వెదకెను - జాలిని నాపైన జూపెను పాతవి గతించెను - గీతమాలపింతును యేసు తోడ నుందు నిరతము (కా)
3. దాగు చోటుగా - నా దివ్య బాటగా - నా యేసు నన్ను చేరెను కన్న తల్లిగా - నా ప్రాణ ప్రియునిగా - యేసు నాదు ముందు నడిచేను నాకు తోడు నీడగా - నీ కృప నాకుండగా కొదువలేదు - దిగులు లేదుగా (కా)
Kaalamella maarinaa – maaradu naa Yesu Naadudu Bhoomi maarpu chendinaa – naa Swami Yesu maata thappadu Paralokam mahimanu – dividoota ganamu Vidanadi nannu veduka vacchenu Aa ghora siluvunu – naa koraku moseenu Paapi koraku praanamichenu