కదలకుందువు సీయోను కొండవలె
బెదరకుందువు బలమైన సింహం వలె (2)
యేసయ్య నీ చెంత ఉండగా
ఏ చింత నీకింక లేదుగా (2)
కష్టములెన్నో కలుగుచున్ననూ
నిట్టూర్పులెన్నో వచ్చియున్ననూ
దుష్ట జనములుపై దుమికి తరిమిన
భ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా ||కదలకుందువు||
నీటి వరదలు నిలువెత్తున వచ్చినా
నిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినా
ఆకాశము నుండి పై అగ్ని కురసినన్
ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు ||కదలకుందువు||
నీరు కట్టిన తోటవలెను
నిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెను
నీటి కాల్వల యోరను నాటబడినదై
వర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్ ||కదలకుందువు||
Kadalakunduvu Siyonu kondavale,
Bedarakunduvu balamainā simham valē. (×2)
Yesayya nee chenta undaga,
Ē chinta neekinka lēdaga. (×2)
Kashtamulennō kaluguchunnanu,
Nittoorpulennō vacchiyunnanu.
Dushta janamulupai dumiki tharimina,
Bhrashta manushyulu nee meediki vachinā.
Neeti varadhalu niluvettuna vachinā,
Nindu samudramu neellu uppongi poralina.
Aakashamunundi pai agni kurasinā,
Ēnādu ē kashtam nashtam neekundadu.
Neeru kattina tōtavale nu,
Nithyam ubukuchundu neeti ootavale nu.
Neeti kaalvala yoranu natabadinadai,
Vardhillu vruksham valē nikṣepamugā neevunduv.