కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||
నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం – ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం||హల్లెలూయా||
Kani vini erugani karunaku neevē aakaaram thandri,
Neevē aadhāram thandri. (×2)
Dayāmayaā, nee choopulatho,
Daaveedu thanayā, nee pilupulatho.
Nee roopamu kanipinchē,
Halleluya, halleluya, halleluya, halleluya. (×2)
Nee pada dhoolulu raalina nēlallo,
Mēmunnaamante – bhaagyamundā inthakantē!
Challani nee chethulu thaaki,
Pulakithamaipōyē – brathukē puneethamaipōyē.
Kanulārā kantimi nee roopam,
Manasārā vintimi nee māta.
Idhi apurūpam – idhi adrushtam,
Emi chesināmō punyam,
Mā jeevithālu dhanyam.
Click a stanza to preview here.