కఱుణాపీఠము జేరరే దేవుని కృపా చరణ స్థలిని జేరరే పరలోక
జనకుని వరములు లభియించు తరుణమౌ ప్రార్థనలో కరములు జోడించి ||కఱుణా||
1. హృదయ వేదననొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు
వదల కుండగ ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదమున నొందిన ||కఱుణా||
2. కన్న ప్రేమను యిమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని అన్ని
యెఱిగిన తండ్రి హన్నాను దీవింప వన్నె కెక్కిన కొడుకున్ చెన్నుగా
నొందిన ||కఱుణా||
3. శాప భయమును నేడ్చుచు దావీదు తన పాప రూపము జూచుచు
తాపముతో పశ్చా త్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్ష మాపణ నొందిన
||కఱుణా||
4. కాయమున వెత నోర్చును యోధుడు పౌలు సాయమీ ధర గోరుచు
రోయుచు దన ముల్లు దీయుమని ప్రార్థించి వేయిరెట్లుగ కృపయు
ప్యాయముగ నొందిన ||కఱుణా||
5. దినమంత పని జేయుచు నాధుడా యేసు జనుల బాధల మోయుచు
ఇనుడు మరుగౌవేళ జనకుని కడకేగి మనసార విశ్రాంతి యనుభవించిన సథలము ||కఱుణా||
6. ఇల బ్రతుకంతయు ప్రార్థన ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన
చెలువుగ విజ్ఞాప నలు జేయుచును మనపై గలకాలమును దీవె నలు
వర్షించెడి చోటు ||కఱుణా||
Karunaapeethamu jerare
Devuni krupaa charana sthalini jerare paraloka
Janakuni varamulu labhiyinchu tarunamou
Praarthanalo karamulu joodinchi ||Karunaa||
Hrudaya vedananu ondachu Yaakobu
Tana madhilo bhayamuna gundachu
Vadala kundaga Prabhuni padamulu sandhinchi
Sadayuni deevena mudamuna nondina ||Karunaa||
Kanna premanu immani sodari Hanna
Vinnavinchaga Devuni anni
Yerigina Thandri Hannanu deevimpa
Vanne kekkina kodukun chennuga nondina ||Karunaa||
Shaapa bhayamunu nedchuchu Daaveedu
Tana paapa roopamu choochuchu
Thaapamutho pashchaaththaapamutho
Prabhuni praapugoragane kshamapana nondina ||Karunaa||
Kaayamuna vetha norchunu yodhudu Paul
Saayame dhara goruchu
Royuchu danamullu deeyumani
Praarthinchi veyiretlu ga krupayu
Pyaayamuga nondina ||Karunaa||
Dinamanta pani jeyuchu Naadhudaa Yesu
Janula baadhalu moyuchu
Inudu maruga vela Janakuni kadakegi
Manasaara vishraanti anubhavinchina sthalamu ||Karunaa||
Ila brathukantayu praarthana
Prabhu Yesunaku siluve tana thudi praarthana
Cheluvuga vignyapanalu jeyuchunu
Manapai galakaalamu deevenalu varshinchedi chotu ||Karunaa||
Click a stanza to preview here.