కరుణించవా నా యేసువా
ఓదార్చవా నజరేతువా (2)
నీ కృపలో అనుదినము రక్షించవా
నీ ప్రేమలో ప్రతి క్షణము లాలించవా (2) ||కరుణించవా||
నిరాశ నిస్పృహలతో కృంగిన వేళ
బలమైన శోధన నను తరిమిన వేళ (2)
మిత్రులే శత్రువులై దూషించిన వేళ (2)
లోకమే విరోధమై బాధించిన వేళ (2) ||కరుణించవా||
ఆత్మీయ యాత్రలో నీరసించు వేళ
నీ సిలువ పయనంలో అలసిపోవు వేళ (2)
సాతాను పోరాటమే అధికమైన వేళ (2)
విశ్వాస జీవితమే సన్నగిల్లు వేళ (2) ||కరుణించవా||
Karuninchaavaa naa Yesuvaa
Odarchavaa Najaretuvaa (2)
Nee krupalo anudinam raksinchavaa
Nee premalo prati kshanamu laalinchavaa (2) ||Karuninchaavaa||
Niraasha nisprahalaato krungina vela
Balamaina shodhana nanu tarimina vela (2)
Mitrule shatrululaai dooshinchina vela (2)
Lokame virodhamaai baadhinchina vela (2) ||Karuninchaavaa||
Aathmiya yaatraalo neerasinchu vela
Nee siluva payanamlo alasipovu vela (2)
Sataanu porataame adhikamaina vela (2)
Vishwasa jeevitamai sannagillu vela (2) ||Karuninchaavaa||
Click a stanza to preview here.