నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2)
ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1)
ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (1)
మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)
అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2)
అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)
రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి
కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి
చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు
సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె - సంఘము - స్థాపించబడె
కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే
యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను
Nee saakshyamu edi? - Nee bali arpana edi? (2)
Prabhu Yesu nangikarinchi - nidrinchedavela? (1)
Prabhu Yesu nangikarinchi - jaagu chesedavela? (1)
Melko - lemmu (2) - Rarammu vishwasi (1)
Apostalula kaalamandu - upadravamu oṭṭidilo (2)
Anninti sahinchuchu (2) - Aathmaladaayamu chesiri (1)
Raalluto kottabadiri - rampalache koyabadiri
Parama darshanamondi - suvartanu chaattinchiri
Koradato kottabadiri - cherasalayandunchabadiri
Cherasaala sankellunu - vari natanka parachedaledu
Sajeeva yagamuga - Prabhu sevanu jarichiri
Suvartha prabhalamaaye - sanghamu - sthaapinchabade
Kothavistaaramento - kotha koyuvaru kondare
Yesunin piluchuchunde - throosivedavela Prabhu pilupun
Arpinchedanannu - aathma prana shareeramuto
Naa siluvanu etthukoni - ninne vembadintunu nenu
Click a stanza to preview here.