క్షమియించుమయ్యా... ఓ యేసయ్యా...
లెక్కకు మించిన నా పాపాలు...
ఎనలేని నీ కృపను నాపైన చూపి విస్తార దోషాలను మన్నించయ్యా
1. దినదినము నీ నుండి వేరైపోయి - పాపాల ఊబిలో కూరితినయ్యా...
నీవిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి - నిన్నెంతో ఆయాస పెట్టితి దేవా ||క్షమియించు॥
2. నా త్రోవకు వెలుగైన నీ వాక్యము వీడి - ప్రార్థించే చేతులకు సంకెళ్ళు వేసి...
శరీర నేత్రాసల బానిసనై - ఎంతో డంబముతో జీవించితినయ్యా ||క్షమియించు॥
3. మోసాలతో పైపై వేషాలతో - ఎందరినో మాటలతో నమ్మించితి....
నాలోని కపటాన్ని దాచేసి - అందరిని వేలెత్తి చూపించితినయ్యా ||క్షమియించు॥
4 నీవంటె భయభక్తులు వదిలేసినాను - నీవిచ్చు ఐశ్వర్యం కోల్పోయినాను...
పలుమార్లు నీవు, నన్ను గద్ధించినా - లోబడలేదయ్యా నను మన్నించయ్యా
||క్షమియించు॥