లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా
అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం
సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం
దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు
దీనులను రక్షించే దేవ తనయుడు
దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె
విజయ వీరుడై ఉద్భవించెనే
పశుల పాకలో పరుండియుండెనే
ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే
లోకానికి రక్షకుడు వెలిసెనని
తార వెంబడి వెళ్లి వారు
కానుకలర్పించి ఆరాధించారు
ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే
పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు
దూత గణములే జోల పాడగా
సృష్టికి బహు సంబరమాయెగా
Lāla lālalalā lālalalā lā lā lā… lāla lālalalālā
Ambarāniki antēlā manamantā sambarālu chēseddām
Sangīta swarālato ī māṭa andariki chakkaga chāṭi cheppudām
Divi nundi dīnuḍigā bhūviki ēten̄cināḍu
Dīnulu rakṣin̄ce dēva tanayuḍu
Dīnula śramalu vyādhi bādhulalō vidudalaicchē
Vijaya vīruḍai udbhavinchēne
Paśula pākalō parundiyundēne
Ā nāḍu oka tāra jñānulaku teliyajēsē
Lōkāniki rakṣakuḍu velisēnani
Tāra vembadi veḷḷi vāru
Kānukalarpim̄ci ārādhin̄cāru
Ātma pūrnulai tirigi veḷḷiri
Āścaryakaruḍu ālōchanakartā
Samādhānamicchē ī cinnī bāluḍē
Potti guḍḍalalō chuṭṭabaḍē paramātmuḍu
Dūta gaṇamulē jōla pāḍagā
Sṛṣṭiki bahu sambaramāyēgā
Click a stanza to preview here.