లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదు
నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు
వాడు చీకటిలో నడువక
జీవపువెలుగై యుండుడనె యేసు
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు
ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె
పిల్లయే దీపమై వెలుగుచుండు
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు
విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి
వెలుగై యుందురనె యేసుండు
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును
చూచిరి ధన్యులై
లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద
ప్రకాశించెను గొప్ప వెలుగు
ప్రభువు యేసుకు జేయని పాడరే
Lokamantaa velugu prakaashinchenoo
Yesu janminchinappudu
Aakaashamunandu goppa nakshatrambu buttenappudu
Loka gnyaanulu, gollalu velli
Loka rakshakudaina Yesuku mrokkiri
Nēnē velugai cheekatilo veluguchunnaanu
Cheekati daanini grahinchaledu
Nēnu lokamunaku velugai yunnaanu, nannu vembadinchuvaadu
Cheekatilo naduvaka
Jeevapu velugai yundunani Yesu selavichchenu
Aa pattanamulo velugutaku
Sooryudainanu chandrudainanu akkaraledu
Aa pattanamulo Devuni mahimayē
Ellappudu prakaashinuchunnadi
Aa pattanamunaku Devuni gorrepillayē
Deepamai veluguchundunu
Meeru lokamunaku velugai yunnaaru ganuka
Meeru velugu sambandhulu
Meeru kondapaina kattabadina pattanambu valenē
Marugai yundaka narulandarikī
Velugai yunduranī Yesu selavichchenu
Cheekatilo naduchu janulu goppa velugunu choochiri dhanyulai
Lokamandu maranachchaayagala desanivaasula meeda
Prakaashinchenoo goppa velugu
Prabhuvu Yesuku jayani paadarē
Click a stanza to preview here.