మనసెరిగిన యేసయ్యా
మదిలోన జతగా నిలిచావు -2
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి
నీ పత్రికనుగా మార్చావు -2 || మనసెరిగిన ||
నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుధ్ధతకై
సాగిపోదును నేను ఆగిపోలేనుగా - 2 సాహసక్రియలు చేయు నీ హస్తముతో
నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు -2 || మనసెరిగిన ||
వెనకున్న వాటిని మరచి నీతోడు నేను కోరి
ఆత్మీయ యాత్రలొ నేను సొమ్మసిల్లి పోనుగా -2
ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో
నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు -2 || మనసెరిగిన ||
మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై
ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా -2
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగలించెనే వదలలేవు ఎన్నడు } 2 || మనసెరిగిన ||
Manaserigina Yesayya
Madilona jathaga nilichaavu
Hridayaana nee aagnyalu vraasi
Nee patrikanugaa maarchaavu
Nirjeeva kriyalanu vidichi paripoorna parishuddhatakai
Saagipodunu nenu aagipolenugaa
Saahasakriyalu cheyu nee hastamuto
Nannu pattukontive viduvalevu ennadu
Venakunna vaatini marachi neetodu nenu kori
Aathmiya yaathralo nenu sommasilli ponugaa
Aashcharyakriyalu cheyu dakshina hastamuto
Nannu aadukontive edabaayavu ennadu
Marthyamaina dehamu vadili amarthyatanu pondutakai
Prabhu ballaaraadhanaku dooramu kaalenu gaa
Nelamantito nannu roopinchina hastamule
Nannu kougalinchene vadalalevu ennadu
Click a stanza to preview here.