నా ఆశలన్ని తీర్చి
ఆదుకొన్న యేస్సయ్య
ఆనుకున్న వేళలో
ఆదరించినావయ్య
ఎల్లవేళలందున నాకు
ఆధారమైనావయ్య
నీవు ఎల్లవేళలందున నాకు
ఆధారమైనావయ్య
ఆశతీర నిన్నే ఆరాధింతును
బ్రతుకు కాలమంతా
ప్రభువా స్తుతియింతును
నా బ్రతుకు కాలమంతా
ప్రభువా స్తుతియింతును
బ్రతుకుట భారమై
చితికిన వేళలో
చేరదీయువారు లేక
చింతించు సమయములో"2"
ఆగిపోక నేను సాగాలని
ఆశతో అడుగగా అభిషేకాన్ని
సంద్రాన్ని రహదారిగా చేసినట్లుగా
అవరోధములను తొలగించినావుగా
శ్రమలతో నలిగి
విసిగిన వేళలో
ధైర్యపరచు వారు లేక
దుఃఖించు సమయములో"2"
భయపడక నీలో నిలవాలని
ఆశతో అడుగగా ధైర్యాన్ని
తుఫానును మాటతోఅణిచినట్లుగా
శోధనలన్నియు తొలగించినావుగా
అయినవారే విడిచి
ఒంటరైన వేళలో
తోడుండువారు లేక
కృంగియున్న సమయములో"2"
ఓర్పును కలిగి బ్రతకాలని
ఆశతో అడుగగా సహవాసాన్ని
మారాను మధురముగామార్చినట్లుగా
అవమానములను తొలగించినావుగా
Naa aashalanni teerchi
Aadukonna Yesayya
Aanukunna velalo
Aadarinchinavayya
Ellavelal-anduna naaku
Aadhaaramainavayya
Neeku ellavelal-anduna naaku
Aadhaaramainavayya
Aashateera ninne aaradhinthunu
Bratuku kaalamantaa Prabhuvaa stuthiyinthunu
Naa bratuku kaalamantaa Prabhuvaa stuthiyinthunu
Bratukuta bhaaramai chitikina velalo
Cheradiyuvaru leka chintinchu samayamulo (2)
Aagipoka nenu saagalani
Aashato adugaga abhishekanni
Sandranni rahadhaariga chesinatluga
Avarodhamulanu tholaginchunavuga
Shramalatho naligi visigina velalo
Dhairyaparachu vaaru leka duhkinchu samayamulo (2)
Bhayapadaka neelo nilavalani
Aashato adugaga dhairyanni
Tufaanunu maatato anichinatluga
Shodhanalanniyu tholaginchunavuga
Ayinavare vidichi ontaraina velalo
Thodunduvaaru leka krungiyunna samayamulo (2)
Oorpunu kaligi bratakalani
Aashato adugaga sahavaasanni
Maaranu madhuramuga marchinatluga
Avamaanamulanu tholaginchunavuga
Click a stanza to preview here.