నజరేతువాడా - నిన్ను చూడాలి నా యేసునాధా - నిన్ను చేరాలి నీదు రక్తధారలె నను కడగాలి నీదు సాక్షిగ - నేను బ్రతకాలి
హల్లెలూయ పాటలు ఆనంద గీతికలు నా జీవిత కాలమంతా గాన మాలపించాలి
నీ స్వస్థత కావాలి - నీదు మాటలే వినాలి నా జీవిత కాలమందు - నీ గానము చేయాలి నీ రెక్కల చాటున - నేను దాగి యుండాలి నా ప్రాణ నాధుడా - నీ స్తోత్ర గీతి పాడాలి (2) ||నజరేతువాడా||
నీదు అడుగు జాడలయందు - నేను సాగిపోవాలి నీజల్దరు నీడలోన - నేను విశ్రమించాలి భూదిగంత వాసులంతా - నీవే రారాజు వనుచు నీ దివ్య సన్నిధి చేరి - నవ్యగీతి పాడాలి ||నజరేతువాడా||
నీ నామము ఎరుగని వారి కడకు నేను పోవాలి నీ దివ్య ప్రేమ సువార్త - లోకమందు చాటాలి నీ సిలువ శాంతిలో - నీ కరుణ కాంతిలో నా జీవిత కాలమంతా - నేను సాగిపోవాలి ||నజరేతువాడా||