నను పేరు పెట్టి పిలిచినది నీవే కదా
నా చేయి పట్టి నడిపితివి నీవే సదా
పనికి రాని నన్ను నీ పాత్రగా మలచుటకు
యుగయుగములు నీతో నే జీవించుటకు
నిను నీవే నాకు బయలు పరచుకుంటివి
నీ రక్షణ మార్గములోనికి నన్ను నడుపుచుంటివి
తల్లి గర్భమందు నే రూపింపబడక మునుపే
నీదు ప్రేమ జీవగ్రంథమందు నన్ను నిలిపే
ఎంతగా కరుణించితివో నీ నామము ఎరుగుటకు
ఏ అర్హత చూసితివో నీ ప్రేమను పొందుటకు
ఈ జగతికి పునాదులు వేయకన్నా ముందుగా
నీ తలపులలో నేను నిలిచి యుంటి నిండుగా
నీదు ప్రేమ అవసరము నాకుందని గుర్తించి
నీ ముద్రను వేసితివి సిలువలో నను రక్షించి
Nanu peru petti pilichinadi neeve kada
Naa cheyi patti nadipitivi neeve sada
Paniki raani nannu nee paatraga malachutaku
Yugayugamulu neetho ne jeevinchutaku
Ninu neeve naaku bayalu parachukuntivi
Nee rakshana maargamuloniki nannu nadupuchuntivi
Thalli garbhamandu ne roopimpabadaka munupe
Needu prema jeevagranthamandu nannu nilipe
Enthaga karuninchitivO nee namamu erugutaku
E arhatA choositivO nee premanu pondutaku
Ee jagathiki punaadulu veyakannaa munduga
Nee thalapulalo nenu nilichi yunti ninduga
Needu prema avasaramu naakundani gurthinchi
Nee mudranu vesitivi siluvalo nanu rakshinchi**
Click a stanza to preview here.