నా ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను స్తుతీంచేదను
శాశ్వత కృపతో నను దీవించిన నా స్వరము నీకే అంకితం
ఒంటరినైన నాతో తోడుగా నిలిచి తల్లివలే నను ఓదార్చినావు
ఎవరు చూపని ప్రేమను చూపి కంటికి రెప్పలా నను కాచినావు
నీ కృపయే ఆధారం, నీ కృపతో ఆదరణ నీ కృపలో ఆశ్రయం నీ కృపయే చాలును
నాకున్న వారే దరిచేరనివ్వక అర్హతే లేదని నను త్రోసి వేయగా
అవమానములే అలవాటవ్వగా అంధకారమే నా ముందు నిలవగా
మరువని స్నేహమై మారని బంధమై నాకు తోడుండినావు
నీ వాస్తల్యము నాపై చూపి నన్ను స్థిర పరచినావు , నన్ను హెచ్చించి నావు
మహా ఘనుడ నీ ప్రేమ మధురం నిన్ను విడిచి నేను మనలేను రాజా
సరిరా రెవ్వరు ఇలలో నీకు అసమాన మైన నీకు సాటి రారెవ్వరు
నీ సహవాసము నాకెంతో ప్రియము నీవే నా భాగ్యము
నిత్య సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నానయ. నే వేచి ఉన్నాను దేవ
Naa prāṇa priyudā Yesayyā ninnu stutīn̄chedanu
Śāśvata kṛpatō nanu dīvinchina nā svaramu nīkē ankitam
Oṇṭarinaina nātō tōḍugā nilichi tallivalē nanu ōdārchināvu
Evaru chūpani prēmanu chūpi kaṇṭiki reppalā nanu kāchināvu
Nī kṛupayē ādhāram, nī kṛupatō ādarana
Nī kṛupalō āśrayam nī kṛupayē chālunu
Nākunna vāre darichēranivvaka arhatē lēdani nanu trōsi vēyagā
Avamānamulē alavāṭavvagā andhakārāmē nā mundu nilavagā
Maruvani snēhamai māranī bandhamai nāku tōḍuṇḍināvu
Nī vāstalyamu nāpai chūpi nannu sthira parachināvu, nannu hechchināvu
Mahā ghaṇuḍa nī prēma madhuram ninnu viḍichi nēnu manalēnu rājā
Sarirā evaru illalō nīku asamāna maina nīku sāṭi rārēvaru
Nī sahavāsamu nākenthō priyamu nīvē nā bhāgyamu
Nitya Sīyōnulō ninu chūḍālanī āśatō unnānaya. Nē vēchi unnānu dēvā
Click a stanza to preview here.