నీ సిలువే నా శరణము
విలువైన రుధిరాన్ని కార్చి
వెలపోసి నన్ను కొన్నావు
ప్రేమా త్యాగం నీవే యేసయ్యా
మహిమా నీకే ఆరోపింతును
గాయాలు పొందినావు – వెలివేయబడినావు
నా శిక్ష నీవు పొంది – రక్షణను కనుపరచావు
నీ ప్రేమ ఇంత అంతని – నే తెలుపలేను
నీ కృపను చాటెదన్ – నా జీవితాంతము
నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు
కొరడాలు చెళ్ళని చీల్చెనే – నీ సుందర దేహమునే
తడిపెను నీ తనువునే రుధిరంబు ధారలే
వెలి అయిన యేసయ్యా – బలి అయిన యేసయ్యా
సిలువలో ఆ సిలువలో – ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేళాడిన యేసయ్యా
విలువే లేని నా బ్రతుకును – విలువ పెట్టి కొన్నావయ్యా
నాదు పాపమంతయూ (2)
నీదు భుజముపై మోసావయ్యా
గొల్గొతా కొండ పైన
గాయాలు పొందితివే
చెమటయు రక్తముగా – ఆత్మల వేదనయూ
పొందెను యేసు నీ కొరకే
తండ్రీ నీ చిత్తం – సిద్ధించు గాక అని పలికెను
కల్వారిలో జీవామిచ్చెన్
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెను యేసు
రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
చలించిపోయెనే ఆ సిలువ ధాటికి
కసాయి చేతిలో అల్లాడిపోయెనే
రగిలిందిలే ఒక జ్వాలలా – ప్రభు యేసు హృదయము
కరిగిందిలే ఒక ధారలా – పరమాత్మ రుధిరము
కృపా సత్య దేవా – సిలువలో మాకై బలియై
రక్తము చిందించినావు – రక్షణిచ్చినావు
ఆరాధింతుము నిన్ను యేసు – ఆత్మ సత్యముతో
పాడి కొనియాడి కీర్తింతుము
పూజించి ఘనపరతుము
హాల్లేలూయా హాల్లేలూయా
నిన్నే ఆరాధింతుమ్
Nee siluve naa sharaṇamu
Viluvaaina rudhiraanni kaarchi
Velaposi nannu konnaavu
Premaa tyaagam neevey Yesayyaa
Mahimaa neekey aaropinthunu
Gaayaalu pondinaavu – veliveyabadinaavu
Naa shiksha neevu pondi – rakshaṇanu kanuparachaavu
Nee prema intha anthani – ney telupalenu
Nee krupanu chaathedan – naa jeevithaanthamu
Neramu cheyani neevu – ee ghora paapi koraku
Bhaaramaaina siluva – moyaleka mosaavu
Koradaalu chellani cheelcheney – nee sundara dehamuney
Tadiipenu nee tanuvuney rudhirambu dhaaraley
Veli aina Yesayyaa – bali aina Yesayyaa
Siluvalo aa siluvalo – aa ghora Kalvarilo
Tuluvala madhyalo vrelaadina Yesayyaa
Viluvey leni naa bratukunu – viluva petti konnaavayyaa
Naadu paapamanthayoo (2)
Needu bhujamupai mosaavayyaa
Golgothaa konda paina
Gaayaalu pondithivey
Chematayu rakthamugaa – aathmala vedanayoo
Pondenu Yesu nee korakey
Thandree nee chittam – siddhinchu gaaka ani palikenu
Kalvaarilo jeevaamicchen
Nee paapamulanu tolaginchutakai
Needu siluvan mosenu Yesu
Ragilindiley oka jwaalalaa – Prabhu Yesu hrudayamu
Karigindiley oka dhaaralaa – Paramaathma rudhiramu
Chalinchipoiyeney aa siluva dhaatiki
Kasaayi chethilo allaadipoiyeney
Ragilindiley oka jwaalalaa – Prabhu Yesu hrudayamu
Karigindiley oka dhaaralaa – Paramaathma rudhiramu
Krupaa satya Devaa – siluvalo maakai baliyai
Rakthamu chindinchinaavu – rakshaṇichchinaavu
Aaraadhinthumu ninnu Yesu – aathma satyamutho
Paadi koniyaadi keerthinthumu
Poojinchi ghanaparathumu
Halleluyaa Halleluyaa
Ninney aaraadhinthum
Click a stanza to preview here.