నీ ఉదయ కాంతిలో - నే నడచివెళ్ళెద
నీ అడుగు జాడలే నే అనుసరించెద
నదివలె నీ సమాధానము - విడిచిపోని సహవాసము
నా తోడుగా ఉంచావయ్యా - నా తండ్రివై నా యేసయ్య
1.నీ వాక్యపు వెలుగులో - నా స్థితిని చూచితి
నా భారము, నా భయమును, తొలగించి దరి చేరితివి
చీకటిలోనుండి ఆశ్చర్యమైన - నీ వెలుగుకు పిలచిన దేవా
నా రక్షణ దీపం వెలిగించినావే - నీ మహిమకై ప్రకాశించెద
2.ఏ జలమైనా ఏ జ్వాలైనా - నే భయముచెందను
విశ్వాసమే నా బలం - నీతోనే విజయము
నను మరువని నీ ప్రేమ, విడువని నీ కృపకు, మరిఏదీ సాటిరాదయా
ఆ ప్రేమను తలచి, నీలోనే నిలచి, నీ కృపలో సాగెదనయ్యా
Nee udaya kaantilo – ne nadachivelletha
Nee adugu jaadale – ne anusarinchetha
Nadivale nee samaadhanamu – vidichiponi sahavaasamu
Naa todugaa unchaavayya – naa tandrivi naa Yesayya
1. Charanam 1:
Nee vaakyapu velugulo – naa sthitini choochiti
Naa bhaaramu, naa bhayamunu – tolaginchi dari cheritivi
Cheekatilonundi aashcharyamaina – nee veluguku pilachina Devaa
Naa rakshana deepam veliginchaava – nee mahimakai prakaashinchetha
2. Charanam 2:
Ee jalamainaa, ee jwaalaainaa – ne bhayamuchendanu
Vishwasame naa balam – neetone vijayamu
Nanu maruvani nee prema, viduvani nee krupaku – mari edee saatiraadaya
Aa premaku gurtuchi, neelone nilichi – nee krupalo saagedanayya
Click a stanza to preview here.