నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము – నిత్యము ఆనందమే
సీయోనులో స్థిరమైన పునాది నీవు
నీ మీదే నా జీవితము అమర్చుకున్నాను
సూర్యుడు లేని చంద్రుడు లేని
చీకటి రాత్రులు లేనే లేని
ఆ దివ్య నగరిలో కాంతులను
విరజిమ్మెదవా నా యేసయ్యా
కడలి లేని కడగండ్లు లేని
కల్లోల స్థితి గతులు దరికే రాని
సువర్ణ వీధులలో
నడిపించెదవా నా యేసయ్యా
సంఘ ప్రతిరూపము – పరమ యెరుషలేము
సౌందర్య సీయోనులో
నీ మనోహరమైన ముఖము దర్శింతును
నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే
ఆనందమే పరమానందమే
Neetone naa nivaasamu – nityamu aanandame
Soundarya Seeonulo
Nee manoharamaina mukhamu darshintunu
Neetone naa nivaasamu – nityamu aanandame
Seeonulo sthiramina punadi neevu
Nee meede naa jeevitamu amarchukunnanu
Sooryudu leeni chandru leeni
Cheekati raathrulu lene leeni
Aa divya nagarilo kaanthulanu
Virajimmedava naa Yesayya
Kadali leeni kadagandlu leeni
Kallola sthiti gathulu darike raani
Suvarna veedhulo
Nadipinchedava naa Yesayya
Sangha prathiroopamu – param Yerushalemu
Soundarya Seeonulo
Nee manoharamaina mukhamu darshintunu
Neetone naa nivaasamu nityamu aanandame
Aanandame paramaanandame
Click a stanza to preview here.