ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన - నిన్ను పోలినవాడు ఎవ్వడు?
భయ పడకు - నేను నీ కేడెమును - బహుమానమున్
అత్యధికముగా చేతునని - యెహోవా దేవుడే పల్కెన్
నా నిబంధనను - నే - రద్దు పరచ ననె గదా
నా నోట నుండి - వెళ్ళిన మాటను - మార్చననె గదా
సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము
తొలగి పోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు
నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తిగలదు
నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు
నీవు భయపడకుము - బాధించు వారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను - నీకు తోడైయున్నాను
O Israayelu — needu bhaagyamentho goppadi
Yehovaa rakshinchina — ninnu polinavaadu evvadu?
Bhayapadaku — nenu nee kedemunu — bahumaanamun
Athyadhikamuga chetunnani — Yehovaa Devude palkena
Naa nibhandhananu — ne — raddhu parachanane gada
Naa nota nundi vellina maatanu — maarchanane gada
Sarvonnathuni raajyamu — shaashvathambu nikkamu
Tholagipodu ennadu — layamu kaadu ennadu
Nee mandira samruddhilo — variki triptigaladu
Nee aananda pravaahamulo — neevu thraaginchuchunnavu
Neevu bhayapadakumu — baadhinchu vaaru raakundanu
Dooramuga nundinanu — neeku toda iyunnanu
Click a stanza to preview here.