ఓ మానవా.. నిజమేదో ఎరుగవా
ఓ మానవా.. ఇకనైనా మారవా
మన పాపములను క్షమియించుటకే
సిలువ మరణము పొందెనని (2)
గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2)
ఈ దినమే అనుకూలం…
లేదిక వేరే ఏ సమయం (2)
నిజమేదో తెలియకనే
చనిపోతే నీ గతి ఏమి? (2) [ఓ మానవా]
సిలువను గూర్చిన శుభ వార్త
వెర్రితనముగా ఉన్నదా?
దేవుని శక్తని తెలుసుకొని
ప్రభు మార్గమును చేరెదవా (2) [ఈ దినమే]
ప్రయాసముతో భారము మోసే
నిన్నే దేవుడు పిలిచెనుగా
ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద
వేగిరమే పరుగిడి రావా (2) [ఈ దినమే]
నీ ధనము నీ ఘనము
నీ సర్వస్వము చితి వరకే
అర్పించుము నీ హృదయమును
(నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) [ఈ దినమే]
O manava.. nijamedo erugava
O manava.. ikanaina maarava
Mana paapamulanu kshamiyinchutake
Siluv maranamu pondenani (2)
Grahiyinchi nEdu – aa Yesu prabhuni vedu (2)
Ee diname anukoolam…
Ledika vere e samayam (2)
Nijamedo teliyakane
Chanipote nee gati emi? (2) [O manava]
Siluvanu gurchina shubha vaartha
Verritanamuga unnada?
Devuni shaktini telusukoni
Prabhu maargamunu cheredava (2) [Ee diname]
Prayasamuto bhaaramu mose
Ninne Devudu pilichenuga
Prayatnamu veedi vishranthini ponda
Vegirame parugidi rava? (2) [Ee diname]
Nee dhanamu nee ghanamu
Nee sarvaswamu chiti varake
Arpinchumu nee hrudayamu
(Nija) rakshakudaina Prabhu korake (2)
Click a stanza to preview here.