ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా
బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా..
ఓ బాటసారి ఓహో బాటసారి
జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా
గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది
నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం
పుట్టగానే తొట్టెలో వేస్తారు
గిట్టగానే పెట్టెలో మూస్తారు
జాగు చేయక కాటికి మోస్తారు
ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ..
బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం
ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు
ఏడిపిస్తూ సమాధికి పోతావు
కూడబెట్టినవి మోసుకు పోలేవు
ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ..
జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం
మరణము ఒక నిద్ర యేసునందు
అంతము అది కాదు క్రీస్తునందు
మృతులు లేచుట స్థిరము యేసునందు
నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ..
నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము
అంతా ఆ దైవ నిర్ణయం
మనిషి కాలగత దేవుని ఆదేశం
O yaatrikudaa oho yaatrikudaa
Brathuku prayaanamulo gamyamentha dooramo telusaa..
O baatasari oho baatasari
Jeevitha yaathralo kaalam entha vishaalamo telusaa
Gunde aagipogaane oopiri aagipothundi
Naadi nilichipogaane aathma egiripothundi
Anthaa aa daiva nirnayam
Manishi kaalagatha Devuni aadesham
Puttagaane thottelo vesthaaru
Gittagaane pettelo moosthaaru
Jaagu cheyakaa kaatiki mosthaaru
Aaraduugula guntalo thosthaaru aa a aa.. aa..
Brathuku moolyaminthe – manishiki unna viluvanthe
Anthaa aa daiva nirnayam
Manishi kaalagatha Devuni aadesham
Edchukuntu bhoomipai pudathaavu
Edipisthu samaadhiki pothaavu
Koodabetti navanni mosuku polevu
Aashinchina vevi nee ventaraavu o o o.. o..
Jeevitha saaramu inthe – manishi brathuku bhaavamu anthe
Anthaa aa daiva nirnayam
Manishi kaalagatha Devuni aadesham
Maranamu oka nidra Yesunandu
Anthamu adi kaadu Kreesthunandu
Mruthulu lechuta sthiramu Yesunandu
Nithya jeevamu varamu Kreesthunandu aa a aa.. aa..
Nede rakshana samayamu – ika aalasichina narakamu
Anthaa aa daiva nirnayam
Manishi kaalagatha Devuni aadesham
Click a stanza to preview here.