ఒకే ఒక ఆధారం - నీవే యేసయ్యా
ఆదరణకర్తవు - నాదు యేసయ్య
కృపానిధి నీవై - దయానిధి నీవై
నన్ను కాచు దేవుడవు - నా రక్షణ శృంగమా
నమ్ముకొంటి ఒకనాడు - స్నేహితులే హితులని
అమ్ముకుంటి సర్వస్వం - అధములైన వారాలకు
నేనమ్మిన నావారే - నిందించిన సమయంలో
నీవిచ్చిన నిరీక్షణ - సిగ్గుపరచలేదయ్యా
అవమానం ఆవరించి - ఆత్మీయత కరువాయె
వేదనతో నా హృదయంలో - మానని బహు గాయమాయె
నీ పాదం శరణాయే - నా ఒంటరి సమయంలో
నీవిచ్చిన వాగ్దానం - వరముగా మారెనయ్యా
Click a stanza to preview here.