ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క||
మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క||
అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
వాని నాదరింపక ||ఒక్క||
వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
పోయె గరుణలేకను ||ఒక్క||
పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
గరుణతోడ భేదమొంచక ||ఒక్క||
నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క||
అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
జూచి యాదరింపవలయును ||ఒక్క||
Okka manuju Derushalemunundi
Yeriko pattanamunaku makkavatho vedaluchunde
Kontha dhanamutho
Maargamandu dongala thani pattikotti
Dochukoniri moorchapovu natlu
Gotti vidichi velliri
Apudu nokka yaajakundu vacchi jooci
Prakkaganu kapatamutho velle
Vaani naadarimpaka
Venuka nokka levikundu vacchi jooci
Yorvaleka gannulaaraa jooci
Poye garunalekanu
Pidapa samarayundu vacchi jooci
Yorvaleka gannulaaraa jooci
Garunathoda bhedamonchaka
Noone draaksharasamu posi
Gaayamulanu gatti
Vaani ghanamagu vaahanamumeeda
Nooru cherchenu
Atuvalenu manamu kooda kashtamulalo
Nunduvaari kashtamulanu
Jooci yaadarimpavalayunu
Click a stanza to preview here.