ప్రతిదినము నీ అనుగ్రహమే ఈ జీవితం నీదయ్య
నాదంటూ ఏమి లేదయ్య
ఈ పాపి క్షేమంకై ఆ ప్రాణ త్యాగమా
నీ ప్రేమ చాలు నాకు తీరని ఓ ఋణమా..
ఈ జీవితం నీదయ్యా నాదంటూ ఏమి లేదయ్య...
చరణం 1
తీరమే దూరమై-భారమే చేరువై
మమతాలే మాయమై -మౌనమే స్నేహమైనా
నాతోడు నీవైన్నావు -కేడెమై నడిపించావు...
ఈ జీవితం నీదయ్య
నాదంటూ ఏమి లేదయ్య..
చరణం 2
యోగ్యతే లేని నాపై -భాద్యతను చూపావు
శ్రమలందు చేయి విడువక - శ్రద్దగా నను దాచావు
వేచియున్న కన్నీటికి దాచియున్న దీవెనలొసగే నా కన్న తండ్రి నీవయ్య..
నీవుంటే కొదువే లేదయ్య...
చరణం 3
ప్రళయమంటి శత్రుమూఖలు చుట్టి నన్ను ఆవరించగా
స్థిరము అనుకున్న ఆప్తులు
కరము విడిచి నన్ను త్రోయగా
నీవు కలుగజేసుకున్నావు..
దారి చూపి నెమ్మదినిచ్చావు..
ఏ ప్రేమ సరిరాదయ్య..
నీ సాక్షిని నేనే యేసయ్య...
Click a stanza to preview here.